గర్భధారణ సమయంలో మహిళలు చాల జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు తీసుకునే ఆహారం మీదే బిడ్డ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అయితే ప్రసవం అనేది అంత తేలికైన ప్రక్రియ కాదు. ఇందులో ఆడవారు చాలా రకాల సవాళ్లు, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ యోగా చేయడం ద్వారా వీటిలో చాలా సవాళ్లను అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు.