బిడ్డకు జన్మనివ్వాలని ప్రతి మహిళ ఎన్నో కలలు కంటుంటారు. తొమ్మిది నెలల పాటు బిడ్డను మోయాలంటే తల్లి ఎంతో ఓపికతో, జాగ్రత్తతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఏ చిన్న పొరపాటు చేసినా అది కడుపులోని బిడ్డపై ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది. ఈ సమయంలో చిన్న పొరపాట్లే పెద్ద సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉంటాయి.