గర్భధారణ సమయంలో మహిళలు చాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. గర్భధారణ సమయంలో చేసే వ్యాయామం మానసిక శారీరక ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాదు.. గర్భంలో ఉన్న పిల్లలకు కూడా ఎంతో మంచిదట.. గర్భిణీ స్త్రీ వ్యాయామం చేయడం వల్ల వారి సంతానానికి మధుమేహం మరియు ఇతర జీవక్రియ వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువ అని కొత్త పరిశోధనలు ద్వారా తెలుస్తోంది.