గర్భధారణ సమయంలో గర్భిణులు చాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గర్భం ధరించినప్పుడు వచ్చే ఎలాంటి కాంప్లికేషన్ అయినా ఆందోళన కలిగించేదే అయినా ఈ విషయంలో కొన్ని మంచి వార్తలే ఉన్నాయి. తల్లి కాబోతున్న వారు జెస్టేషనల్ డయాబెటీస్‌ని ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడం, అవసరాన్ని బట్టి డాక్టర్ సూచన ప్రకారం మెడిసిన్స్ తీసుకోవడం ద్వారా కంట్రోల్ చేయవచ్చు.