మహిళలు గర్భం దాల్చిన మొదలు నుండి బిడ్డకు జన్మనిచ్చే వరకు చాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ మధ్యనే సిజేరియన్ జరిగి ఉంటే కుట్లు నయమవడానికి ప్రత్యేక శ్రద్ధ ఎంతైనా అవసరం . సిజేరియన్ కారణంగా కావచ్చు లేదా సహజ ప్రసవం సమయంలో అయినా కూడా కుట్లు పడి ఉండవచ్చు . ఈ కుట్లు ప్రతి స్త్రీ కి ఒకేలా ఉండవు,వారి వారి శరీర ఆకారాన్ని బట్టి వివిధ రకాలుగా ఉంటాయి.