గర్భిణులు బిడ్డకు జన్మించిన తర్వాత ఎంత పుష్టికరమైన ఆహారం తీసుకున్న పాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. మనం తీసుకునే ఆహారంలో పాలను ఉత్పత్తి చేసే పదార్థాలు అదిక శాతం ఉండేలా చూసుకోవాలి. మనకి అందుబాటులో ఉండే కొన్ని రకాల కూరగాయల్లో, మెంతులు, వెల్లుల్లి, తులసి, వాము, కాకరకాయి, బొప్పాయి మొదలైన వాటిలో పాలను ఉత్పత్తి చేసే గుణం అధికంగా ఉంటుంది.