సృష్టికి మూలం అమ్మ. తన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతూ గుండెల్లో పెట్టుకుని పెంచుతుంది అమ్మ. బువ్వపెట్టి, బుజ్జగించి, లాలించి, పాలించి.. తన బిడ్డల్ని ప్రయోజకుల్ని చేసేంత వరకు విశ్రమించదు అమ్మ. అమ్మ అనే రెండక్షరాలలోని మాధుర్యాన్ని పొందాలంటే ఎన్ని జన్మలెత్తినా తనివి తీరదు. ప్రపంచంలో మనకు లభించే అన్ని ప్రేమల కన్నా అమ్మ ప్రేమ విలువైనది.