దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ క్లిష్ట సమయంలో గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే గర్భవతులైన మహిళలు కరోనా సోకకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. గర్భం దాల్చినప్పుడు సహజంగా జరిగే మార్పుల వల్ల గర్భిణి ఊపిరితిత్తుల సామర్థ్యం కొంత తగ్గుతుంది.