గర్భధారణ సమయంలో గర్భిణులు వైద్య పరీక్షల కోసం తరుచూ ఆసుపత్రికి వెళ్తుంటారు. అయితే ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా అసుపత్రులకు వెళ్ళడం కష్టం అవ్వడంతో గర్భిణులు ఆందోళనకు గురవుతున్నారు. గర్భిణులకు అనారోగ్య సమస్యలేవీ లేనప్పుడు, ప్రెగ్నెన్సీకీ, ప్రసవానికీ ప్రమాదం ఉందని గత పరీక్షల్లో నిర్ధారణ కానప్పుడూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.