మాతృత్వం అనేది ప్రతి స్త్రీకి దేవుడు ఇచ్చిన గొప్ప వరం. ఈ వరం శాపం కాకుండా చూసుకోవలసిన బాధ్యత ప్రతి మహిళపై ఉంటుంది. సాధారణంగా గర్భిణులు తీసుకునే మందుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో, ఆహారం విషయంలో కూడా అంతే అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.