దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారిని అరికట్టేందుకు దేశంలో వ్యాక్సిన్ పంపిణీ కూడా చేస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్లను ఎదుర్కొనేలా కొత్త వ్యాక్సిన్లపై పరిశోధనలు జరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.