డబుల్ కా మీఠా.. ఎంతోమందికి ఇష్టమైన ఈ స్వీట్ ఎలా చేసుకోవాలో తెలుసా? ఎంత అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ స్వీట్ మనం ఎక్కువగా బయట తింటాం. అలాంటి ఈ స్వీట్ ఎలా చెయ్యాలో ఇక్కడ చదివి తెలుసుకోండి. ఇంట్లోనే చేసుకొని తినండి.
కావలసిన పదార్థాలు..
తెల్ల బ్రెడ్ స్లయిసులు - 8,
పాలు - 1 కప్పు,
పంచదార - మూడున్నర టేబుల్ స్పూన్లు,
మీగడ - 3 టేబుల్ స్పూన్లు,
కరిగించిన తాజా నెయ్యి - 2 టే.స్పూన్లు,
నానబెట్టి, తొక్కతీసి, తరిగిన బాదం - 12,
తరిగిన పిస్తా - అర కప్పు,
కుంకుమ పువ్వు - చిటికెడు.
తయారీ విధానం...
పాలను మందపాటి గిన్నెలో మరిగించాలి, మరో గిన్నెలో పంచదార, రెండు టీ.స్పూన్ల నీళ్లు వేసి పాకం పట్టాలి. బ్రెడ్ స్లయిసె్‌సల అంచులు కత్తిరించాలి. ఆ తర్వాత వీటిని నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. పాలు మరిగాక మీగడ వేసి చిక్కబడేవరకూ ఉడికించాలి. వేయించిన బ్రెడ్ ముక్కలను చక్కెర పాకంలో ముంచి తీసి మరో వెడల్పాటి గిన్నెలో పరుచుకోవాలి. వాటి పైన చిక్కటి పాలను పోసి, పైన మిగిలిన చక్కెర పాకం పోయాలి. తరిగిన బాదం పప్పులు, బాదం పప్పులు చల్చి పొయ్యి మీద చిన్న మంట మీద ఉంచాలి. 10 నిమిషాల్లో నెయ్యి పైకి తేలుతూ డబుల్ కా మీఠా నోరూరించేలా తయారవుతుంది. అప్పుడు కుంకుమ పువ్వు చల్లి వేడిగా సర్వ్ చేయాలి.