కాంపిటేషన్ పేరిట నిర్వహించిన బాడీ బిల్డింగ్ పోటీలు ఆడవారి అందాలను ఆరబోసినయింది. కాస్మో పోలిటన్ నగరాలూ, మెట్రో పోలిటన్ సిటీలలో జరిగే ఈ ప్రదర్శనలను గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేసి ఔత్సహికమైన మహిళా బాడీ బిల్డర్లను అపహాస్యపాలు చేసినట్లయింది. అసలు విషయం ఏంటంటే.. ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము వేదికగా జాతీయ మహిళా జూనియర్స్ బాడీ బిల్డింగ్ కాంపిటేషన్స్ ఆహుతులను కన్ను విందు చేశాయి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో 10వ జాతీయ జూనియర్ పురుషుల, మహిళల బాడీ బిల్డింగ్ చాంపియన్ షిప్ పోటీలు ఆదివారం జరిగాయి.


 ఏ1 కన్వెన్షన్ హాలులో జరిగిన ఈ పోటీలలో ఆహ్లాదకరమైన వాతావరణంలో క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. 15 విభాగాలలో జరిగిన ఈ పోటీలలో విజేతలకు ముఖ్య అతిధులుగా హాజరైన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి పినిపే విశ్వరూప్, పెద్దాపురం శాసనసభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప లు బహుమతి ప్రధానం చేశారు. దివ్యాంగ క్రీడాకారులు తమ ప్రతిభను కనపర్చారు. 


తొలిసారిగా జరుగుతున్న మహిళల జూనియర్ బాడీ బిల్డింగ్ పోటీలకు వివిధ రాష్ట్రాల నుండి మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.   28 రాష్ట్రాల నుండి 375 క్రీడాకారులు హజరయ్యారు. జూనియర్స్ విభాగంలో 260 మంది,  మాస్టర్స్, దివ్యాంగ విభాగంలో 85 మంది,  మహిళా విభాగంలో 30 మంది క్రీడాకారులు మధ్య పోటీలు జరిగాయి.   ఈపోటీలకు ముఖ్య అతిధులుగా పద్మశ్రీ, అర్జున్ అవార్డు గ్రహీత అంతర్జాతీయ బాడీ బిల్డింగ్ చాంపియన్ ప్రేమ్ చంద్ డేగ్రా, మరో అర్జున అవార్డు గ్రహీత టి.వి.పౌలే హాజరయ్యారు.


జాతీయ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈ పోటీలకు 28 రాష్ట్రాల నుండి బాడీ బిల్డింగ్ క్రీడాకారులు, జాతీయ ఫెడరేషన్ అధికారులు, రిఫరీలు తరలివచ్చారు. పట్టణాలకే పరిమితమయ్యే ఈ పోటీలు గ్రామీణ ప్రాంతమైన కోనసీమలోని అమలాపురంలో నిర్వహించడం తమకు గర్వకారణమని తూర్పుగోదావరి జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వంటెద్దు వెంకన్నాయుడు అన్నారు. ఆంద్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు స్వామి రమేష్, శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: