టాలీవుడ్ లో కెరియర్ ప్రారంభం లోనే హీరోగా వెనువెంటనే విలన్ గా మళ్ళీ హీరోగా ఇలా చేసిన అతి కొద్ది మంది నటులలో గోపీచంద్ ఒకరు. ముందు తొలివలపు చిత్రంలో హీరోగా కనిపించిన గోపీచంద్ ఒక మోస్తరు విజయాన్ని అందుకున్నారు. అయితే ఆ తర్వాత అనూహ్యంగా జయం సినిమాలో విలన్ గా మారి విశ్వరూపం చూపించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడం , గోపీచంద్ విలన్ పాత్ర అందర్నీ అలరించడంతో బాగా పాపులర్ అయ్యారు. తరవాత ఈ నటుడి ఇమేజ్ అమాంతం పెరిగింది. అయితే మళ్ళీ గోపీచంద్ కి అవకాశం రావడంతో మళ్ళీ హీరోగా మారారు. అయితే ఆ తరవాత అలా అడపాదడపా హిట్స్ అందుకున్నాడు. కానీ ఎక్కువగా ఫ్లాప్ లనే ఎదుర్కున్నాడు ఈ హీరో.

కానీ గోపీచంద్ కథలను ఎంచుకునే విషయం లో తనని తాను నమ్ముకుని ఉంటే కెరియర్ వేరేగా ఉండేది అని. తన కి సూట్ అయ్యే కథను ఎంచుకోవడం అనేది చాలా ముఖ్యం. అయితే గోపీచంద్ మాత్రం కొన్ని కథల్ని తన స్నేహితులు చెప్పడం వలన ఒకే చేశారని అలా చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అయ్యిందని టాక్. అదే విధంగా గోపీచంద్ ఎంచుకున్న     లక్ష్యం , శౌర్యం వంటి చిత్రాలు మంచి విజయాలను సాధించాయి అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గోపీచంద్ కి స్నేహితులకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు అని వారి మాటను కాదనలేక  పలుమార్లు అలా కొన్ని కథలకు ఒకే చెప్పడం అవి నిరాశ పరచడం జరిగిందని...ఒకవేళ అప్పుడే మొహమాటం లేకుండా నాకు ఇలాంటి స్టోరీస్ సూట్ కావు అని చెప్పి తనకి నచ్చే కాన్సెప్ట్ లను ఎంచుకుని ఉంటే ఈపాటికి ఇండస్ట్రీలో టాప్ హీరోల లిస్ట్ లో చేరుండే వాడని అంటుంటారు.

కాగా ప్రస్తుతం కొన్ని చిత్రాలు లైన్ లో ఉన్నాయి. వాటిలో ఒకటి మారుతీ డైరెక్షన్ లో వస్తున్న పక్కా కమర్షియల్. ఇందులో గోపిచంద్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమా హిట్ అయితేనే తన కెరీర్ సేఫ్ అవుతుంది. మరి ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సరైన రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: