
దీంతో నెటిజన్లు బ్రహ్మాజీ ని ఒక ఆట ఆడేసుకున్నారు అంటే ఆ పోస్ట్ ఎంత నెగిటివ్ వైబ్ క్రియేట్ చేసింది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు . అయినా బ్రహ్మాజీ మాత్రం అతనికి అనిపించింది అనిపించినట్లు సోషల్ మీడియా లో పోస్ట్లు పెడుతూ ఉంటారు. అయితే అలాంటి నటుడు బ్రహ్మాజీ ఇపుడు కొద్ది రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నారు అని తెలిసి అంతా షాక్ అవుతున్నారు. అసలు విషయం ఏమిటి..?? ఇది నిజమేనా..?? ఎందుకు బ్రహ్మాజీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ..?? అంటూ ఆశ్చర్యపోతున్నారు.
అయితే ఇకపై కొద్ది రోజులు సోషల్ మీడియా కు దూరంగా ఉండాలి అని అనుకుంటున్నాను అంటూ స్వయంగా బ్రహ్మాజీ నే ప్రకటించారు. అయితే ఎందుకు ఈయన ఇలా అంటున్నారు ,దీని వెనుక పెద్ద కారణం ఏమైనా ఉందా అన్న వివరాలు మాత్రం తెలియలేదు. కొందరు తెలుపుతున్న సమాచారం ప్రకారం సినిమాలపై ద్రుష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.