అయితే ఈ మధ్య ఢీ షో లో జడ్జి గా పూర్ణ ప్లేస్ కాస్త వేరే వాళ్ళకి ఇచ్చేశారు. ఇపుడు పూర్ణ శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో ఇంద్రజకు బదులుగా జడ్జిగా చేస్తోంది. అయితే ఇటీవల ఈ షో లో చేసిన ఒక స్కిట్ చూసి ఫుల్ ఎమోషనల్ అయ్యారు పూర్ణ. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో నూకరాజు, శాంతికుమార్ కలిసి చేసిన స్కిట్ చూసి అందరు ఎమోషనల్ అయ్యారు. కానీ పూర్ణ ఎందుకో గాని ఎప్పుడూ లేని విధంగా ఈ స్కిట్ కు బాగా కనెక్ట్ అయి చాలా ఎమోషనల్ అయ్యారు. నూకరాజు, శాంతికుమార్, ఆసియా కలిసి ఒక విషాద ప్రేమ కథను స్కిట్ గా చేసి చూపించగా, ఈ స్కిట్ చూసి పూర్ణ కూడా బాగా ఎమోషనల్ అయ్యి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి వైపు న్యాయం ఉందో అస్సలు చెప్పడం వీలు కాదు. కానీ ప్రేమించిన వ్యక్తితో జీవితాంతం కలిసి బతకాలన్నా కూడా అదృష్టం ఉండాలి అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు … అయితే ఆ సమయం లో పూర్ణ మాటల్లో చాలా అర్దం కనిపించింది తన జీవితంలో కూడా ప్రేమ విఫలం అయ్యిందేమో అన్న భావన వచ్చి అంతా ఆ విధంగా అనుకుంటున్నారు. ఇందులో నిజమెంతుందో తెలియదు.. కానీ ప్రేమించిన వ్యక్తి తో జీవితం పంచుకోవడం అనేది నిజంగా ఒక గొప్ప వరం అనే చెప్పాలి. కాగా ఈమె దుబాయ్ కు చెందిన ఒక వ్యాపార వేత్తను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.