సోమవారం
స్వస్తి శ్రీ ప్లవ నామ సంవత్సర ఉత్తరఆయణం గ్రీష్మ ఋతువు
జ్యేష్టమాసము
తిథి: . ఏకాదశి రా10.30 (యోగిని ఏకాదశి)
నక్షత్రం : భరణి మ12.12
యోగం: ధృతి మ1.30
కరణం : బవ ఉ9.12 బాలువ 10.30
వర్ణం : రా1.46-3.35కు
దుర్ముహూర్తం : మ12.47-1.39కు తిరిగి మ3.23–4.15కు
అమృతకాలం : ఉ6.47-8.35కు
సూర్యోదయం : 5.47
సూర్యాస్తమయం : 6.55
మేష రాశి
ఆర్థిక పరమైన పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో పని భారం తగ్గుతుంది. బంధు మిత్రుల కలయిక. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన నిరుద్యోగులకు ఆకాశాలు దొరుకుతాయి.
వృషభ రాశి
అన్నివిషయాల్లో తొందరపాటు వద్దు నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. సహనం పాటించే సందర్భాలే ఎక్కువ. వృత్తి ఉద్యోగాల్లో స్వల్ప అనుకూలత. ఆర్థికంగా స్వల్ప లాభం. కంటి సమస్యలు బాధిస్తాయి.
మిధున రాశి
వృత్తి ఉద్యోగాలలో మంచి వాతావణం. కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. చిన్నపాటి సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థికపరమైన పరిస్థితులు కొంత మెరుగవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి.
కర్కాటక రాశి
బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం. నూతన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్య విషయం లో పురోగతి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం. ఆర్థికంగా ప్రగతి.
సింహ రాశి
అన్ని విషయాలలో కూడా అనుకోని సంఘటనలు. గందరగోళ వాతావరణం. ముఖ్యమైన పనులలో జాప్యం. ప్రయాణాల్లో కూడా వ్యయ ప్రయాసలు. ఆర్థికంగా అనుకోని ఖర్చులు. ఆరోగ్య విషయం లో జాగ్రత్త అవసరం.
కన్య రాశి
వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఆర్థికపరమైన సమస్యలు. కొత్త రుణాలు చేయాల్సి రావచ్చు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. నిరుద్యోగులకు అవకాశాలు చేజారుతాయి.
ముఖ్యమైన విషయాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక పరమైన అంశాల్లో సానుకూలత. వ్యాపార విస్తరణకు మంచి అవకాశాలున్నాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృశ్చిక రాశి
ఆర్ధికంగా ప్రగతి. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉన్నత వర్గాల వారితో పరిచయాలు. గృహనిర్మాణ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి.
ధనస్సు రాశి
అన్ని విషయాలలో అనుకూల వాతావరణం. వృత్తి ఉద్యోగాల్లో కావాల్సిన సహకారం లభిస్తుంది. అన్ని విషయాలు లాభసాటిగా | ముగుస్తాయి. చేపట్టిన పనులలో కార్యజయము. ఆర్థిక పరమైన అంశాలు చాలా సంతృప్తికరంగా ఉంటాయి.
మకర రాశి
అన్నిట ప్రతికూల వాతావరణం. వృత్తి ఉద్యోగాల్లో పనిభారం. ఆర్థికంగా రావాల్సిన ధనంసమయానికి చేతికి అందదు. వ్యాపారంలో అనుకోని సఘటనలు. కుటుంబ సభ్యులతో వివాదాలు. కోర్టు వ్యవహారాల విషయంలో వాయిదాల పర్వం.
కుంభ రాశి
వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం. గొప్ప వారి వద్ద నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఊహించని కొన్ని మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. శత్రువులుగా ఉన్న వారు మీ పట్ల వారి దృక్పథాన్ని మార్చుకుంటారు. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.
మీన రాశి
వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. | ఆర్థికపరమైన అంశాలు కలిసిరావు. చాలా వరకు నిర్ణయాలు వాయిదా పడతాయి. కొందరి ప్రవర్తన బాధకలిగిస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు.