టాటా మోటార్స్ మార్కెట్లోకి కొత్త ప్రవేశ పెట్టిన టాటా జికా వాహన ప్రియులను ఇట్టే ఆకర్షిస్తోంది. తక్కువ ధరలోనే అద్భుతమైన ఫీచర్లు కలిగిన వాహనంగా అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇటీవల తన కస్టమర్లను ఆకట్టుకోవడంలో ఫెయిలవుతున్న టాటా మోటార్స్ ఈ జికాతో పూర్వ వైభవం పొందడం ఖాయమంటున్నారు.. 

మరీ జికా ప్రత్యేకతలేంటి.. డిజైన్ ఎలా ఉంది.. ఇంజిన్, పవర్ డిటైల్స్ ఏంటి..  మైలేజ్ ఎలా ఉంది.. ప్లస్ పాయింట్లేంటి.. నెగిటివ్ పాయింట్లేంటి.. సెక్యూరిటీ ఫీచర్లేంటి.. ఓసారి చూద్దాం.. 


డిజైన్ టాటా జికా డిజైన్ కస్టమర్లను మొదటి చూపులోనే ఆకట్టుకుంటుంది. కారు ముందు భాగాన్ని చాలా ఎట్రాక్టివ్ గా తయారు చేశారు. హెడ్ లైట్స్‌ను కార్నర్‌లలో వచ్చాయి. లుక్ స్పోర్టివ్ గా ఉండి చూపరుల మనసు దోచేస్తోంది. ఇక ఇంజిన్ విషయానికి వస్తే.. పెట్రోల్, డీజల్ వేరియంట్లు ఉన్నాయి. 

ఆ డిటైల్స్ లోకి వెళ్తే.. పెట్రోల్ ఇంజన్ 1199సీసీ కెపాసిటీ అయితే డీజల్ ఇంజిన్ కెపాసిటీ 1047సీసీ. పెట్రోల్ ఇంజన్ బీహెచ్ పీ 84. టార్క్ 114. డీజిల్ ఇంజన్ బీహెచ్పీ 69. రెండింటిలోనూ 5 -స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఉంది. మైలేజ్ విషయానికి వస్తే లీటర్ పెట్రోల్ 20 కిలోమీటర్లు ఇస్తుంటే.. డీజల్ లీటర్‌కు 25 కిలోమీటర్లు ఇస్తోంది. 

సెక్యూరిటీ ఫీచర్ల విషయానికి వస్తే.. టాప్-ఎండ్ వేరియంట్‌లో రెండు ఎయిర్ బ్యాగులు ఇచ్చారు. యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, కార్నర్ స్టెబిలిటి కంట్రోల్ వంటి సెక్యూరిటీ ఫీచర్లున్నాయి. 


సీటింగ్ విషయానికి వస్తే.. చాలా కంఫర్ట్ బుల్ గా ఉన్నాయి. ప్రతి సీటు మూడు వైపులా ఉబ్బెత్తుగా ఉండేలా డిజైన్ చేశారు. వాటర్ బాటిల్స్ వంటి వస్తువులు పెట్టుకునేందుకు స్పేస్ ఇచ్చారు. వీటితో పాటు మల్టీమీడియా న్యావిగేషన్ సిస్టమ్, స్మార్చ ఫోన్ ఇంటిగ్రేషన్, బ్లూటూత్ కనెక్టివిటి వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఆడియో సిస్టమ్‌ మామూలే. రివర్స్ పార్కింగ్ కెమేరాలు ఇవ్వడం వల్ల పార్క్ చేసేటప్పుడు డిస్ల్పేలో చూసుకుంటూ కారు పార్క్ చేయొచ్చు. ఇంకా ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీ-ఫంక్షన్ డిస్ల్పే, మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్‌లు అదనపు సౌకర్యాలు. 


ఇక అసలు కీలకమైన రేట్ విషయానికి వస్తే.. స్టార్టింగ్ రేంజ్ రూ. 3.50 లక్షల నుండి ఉన్నాయి. టాటా జికా టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 4 లక్షల నుండి ప్రారంభం. ఈ టాటా జికా మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10, ఫోర్డ్ పిగో వంటి మోడళ్లకు గట్టిపోటియే అంటున్నారు ఆటో ఎనలిస్టులు.


మరింత సమాచారం తెలుసుకోండి: