హీరో మోటర్ కార్ప్ నుండి మరో సరికొత్త సంచలనం హీరో జిర్ స్కూటర్ రిలీజ్ అవుతుంది. స్కూటర్ విభాగంలో అత్యధిక సిసి కెపాసిటర్ గల ఈ స్కూటర్ వాహనదారుల సౌకర్యార్ధం తయారు చేయబడింది. ప్రస్తుతం మార్కెట్ లో పలు రకాల స్కూటర్లు వాడుకలో ఉన్నా హీరో నుండి వస్తున్న ఈ సరికొత్త జిర్ అందరిని ఆకట్టుకుంటుంది. 


ఇక ఈ మోడల్ కూడా యూరోపియన్ స్టైల్ తో సరికొత్తగా డిజైన్ చేయబడింది. గేర్ సిస్టెం నుండి విసిగి వేసారి పోయిన వారికి ఈ స్కూటర్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇక ఈ మీద ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా సాగుతుంది. బైక్ లుక్ కూడా వారెవా అనిపించేలా ఉంటుంది.


ఇక ఈ స్కూటర్ యొక్క టేక్నికల్ ఫీచర్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. డ్యుయల్ ప్రొటెక్టర్ హెడ్ ల్యాంప్ తో కూడిన ఈ స్కూటర్ స్పెషల్ ఎల్.ఈ.డి ఇండికేటర్స్ తో తయారు చేయబడింది. ఇక స్కూటర్ విభాగంలో మొదటి సారి డిస్క్ బ్రేక్ ఫెసిలిటీను కూడా ఈ సరికొత్త హీరో జిర్ కు అందుబాటులో ఉంచుతుంది.  


అంతేకాదు లిక్విడ్ కూల్డ్ పవర్ సిస్టెంతో వస్తున్న ఈ స్కూటర్ అత్యధికంగా 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం సాగించవచ్చు. హీరో మోటో కార్ప్ దీని వెల 80 వేలుగా నిర్ణయించింది. హీరో మోటో కార్ప్ అన్ని ఆథరైజ్డ్ డీలర్ల దగ్గర ఈ స్కూటర్ త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న స్కూటర్లకు ధీటుగా హీరో జిర్ సరికొత్త సంచలనం సృష్టించడం ఖాయం. 


మరింత సమాచారం తెలుసుకోండి: