మార్కెట్ లో ఎన్ని కొత్తరకం బైకులు ఆకర్షిస్తున్నా యువత చూపు మాత్రం యమహా మీదే ఉంటుంది. స్పోర్ట్స్ బైకుల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన యమహా ఇప్పుడు స్కూటర్ విభాగంలో కూడా మంచి సేల్ రిపోర్ట్ ను సాధిస్తుంది. యమహా అంటే ఉన్న బ్రాండింగ్ తోనే వాటి సగటు ఉత్పత్తులను కూడా నమ్ముతున్నారు కస్టమర్స్. 


ప్రస్తుతం పోటీ ప్రపంచంలో తమ ఉత్పత్తులను సేల్ చేసుకునేందుకు రకరకాల ఆఫర్లను కస్టమర్స్ ముందు ఉంచుతూ ఆకర్షిస్తుంటారు. ఇక ఏప్రిల్ 2016 మార్కెట్ లో యమహా 63,927 బైకులను అమ్మి సంచలనం సృష్టిస్తుంది. ఏకంగా కంపెనీ 66 శాతం అధికంగా ఉత్పత్తులను అమ్మడం జరిగింది. ఓ విధంగా దేశంలో యమహా మీద ఉన్న అపార నమ్మకం దీనికి తార్కాణంగా పేర్కొనవచ్చు.


38,568 మార్కెట్ లో ఉన్న యమహా అనూహ్యంగా ఏప్రిల్ నెలకు వచ్చే సరికి 66 శాతం వృద్ధిని సంపాదించడం గొప్ప విషయం. ఇక ఇదే రకమైన పర్ఫార్మెన్స్ తో కనుక యమహా ఉంటే ఇండియాస్ నెంబర్ వన్ టూ వీలర్ బైక్ గా సేల్ రిపోర్ట్ సాధిస్తుంది అనడంలో సందేహం లేదు. యమహాలో ఉన్న అన్ని మోడల్స్ ముఖ్యంగా స్కూటర్ విభాగంలో ఉన్న రే జెడ్.ఆర్, సలుటో అర్.ఎక్స్ కూడా మంచి సేల్ కలిగి ఉన్నాయి.


మరి దేశంలో అందరు మెచ్చే బైక్ తప్పకుండా మీకు నచ్చే అవకాశం ఉంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం కొత్త బైక్ కొనాలనుకునే వారికి ఈ సమీకరణాలు వారి నిర్ణయాన్ని సరైన మోడల్ సరైన కంపెనీ వైపే నడిపిస్తుందని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: