దేశంలో అత్యంత ప్రాముఖ్యత చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల రేటు తాత్కాలికంగా పెంచుతున్నట్టు కంపెనీ నిర్వాహకులు ప్రకటించారు. హిమాలయన్, క్లాసిక్ బైక్ మోడల్స్ అన్నిటికి రేటు పెంచడం జరుగుతుంది. ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బైక్ గా హుందాతనంతో కూడిన రాయల్ ఎన్ఫీల్డ్ ప్రతి ఒక్క కస్టమర్ ను సాటిస్ఫై చేస్తుంది.
అయితే మారుతున్న అవసరాలకు అనుగుణంగా కంపెనీ ఇప్పుడు బైక్ మోడల్స్ రేట్లను స్వల్పంగా పెంచడం జరిగింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం 1,100 నుండి 3,600 వరకు రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయట. ప్రతి మోడల్ కు రేట్ హైక్ చేయడం జరిగింది. ఇక పెంచిన రేటుకి బదులుగా మరిన్ని ఫ్రీ సర్వీస్ లను యాడ్ చేయడం జరుగుతుంది.
కస్టమర్ ప్రయోజనాలే ప్రాముఖ్యంగా రాయల్ ఎన్ఫీల్డ్ సరికొత్త సర్వీస్ విధి విధానాలను ప్రవేశ పెడుతుంది. ఇప్పటికే రోడ్ సైడ్ సర్వీస్ ఫెసిలిటీను అందుబాటులోకి తెచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్ త్వరలోనే మరింత అడ్వాన్సెడ్ సర్వీస్ సెంటర్స్ ను ఏర్పాటు చేయనున్నదట. రేటు పెరిగినా మనసు దోచే అనువైన ఫీచర్స్ తో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ సొంతం చేసుకోవచ్చు.