హీరో నుండి కొత్తగా రాబోతున్న మోడల్స్ కు ఇప్పుడు ఐ3ఎస్ టెక్నాలజీతో అనుసందానం చేయబడుతుంది. అత్యుత్తమ మైలేజ్ బైక్ గా ప్రాచుర్యం పొందిన హీరో మైక్ ఇప్పుడు కస్టమర్స్ ప్రాధ్యాన్యత దృష్టిలో ఉంచుకుని కొత్త అప్డేట్స్ తో వస్తుంది. ఇప్పటిదాకా ఎలా ఉన్నా ఇప్పుడు సరికొత్త ఐ3ఎస్ టెక్నాలజీతో మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమయ్యింది హీరో.
ఇక ఈ కొత్త టెక్నాలజీతో హీరో అచీవర్ 150, ఫ్యాషన్ ప్రో, సూపర్ స్ప్లెండర్ మోడల్స్ కు ఈ టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది. లీటర్ పెట్రోల్ కు మాక్సిమం మైలేజ్ ఇచ్చే హీరో మోటర్ బైక్ కస్టమర్స్ ను ఎట్రాక్ట్ చేయడంలో కూడా ఎప్పుడు ముందుంటుంది. ఇప్పటికే తమ ఉత్పత్తులతో అందరిని ఆకట్టుకుంటున్న హీరో ఈ కొత్త టెక్నాలజీతో మరింత సేల్ ఆధిక్యతను సంపాదిస్తుందని చెప్పొచ్చు.