రాయల్ ఎన్ఫీల్డ్ నుండి 750సిసి కెపాసిటీతో రాబోతున్న వెహికల్ పూణెలో టెస్టింగ్ చేయబడింది. రెండు సిలిండర్ కెపాసిటీ గల ఇంజిన్ తో ఈ బైక్ అందుబాటులోకి వస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 సిసి కెపాసిటీ తో ఉండే లిక్విడ్ కూలింగ్ సిస్టెమే ఈ కొత్త బైక్ లో కూడా డిజైన్ చేయబడింది.
రాయల్ ఎన్ఫీల్డ్ మీద కస్టమర్స్ కు ఉన్న నమ్మకాన్ని పదింతలు చేస్తూ ఈ సరికొత్త బైక్ తయారు చేయబడింది. ఎన్ఫీల్డ్ స్పీడ్ లో సరికొత్త అనుభూతిని ఇవ్వడంలో ఈ కొత్త బైక్ కచ్చితమైన కెపాసిటీ కలిగి ఉందని అంటున్నారు. కంటినెంటల్ జిటి బైక్ ధర 2.05 లక్షలు షోరూం ప్రైజ్ తో వస్తుంది. మిగతా ఫీచర్స్ అన్ని బైక్ మార్కెట్ లోకి విడుదల చేసే టైంలో అందుబాటులో ఉంచుతారు.