ఈ 2017 సంవత్సరంలో రెనాల్ట్ నుండి కాప్చర్ క్రాస్ ఓవర్ వెహికల్ రాబోయే నెలల్లో రిలీజ్ చేయబోతున్నారు. రెనాల్ట్ డస్టర్ తో మొదలైన ఈ క్రాస్ ఓవర్ ఎస్.యు.వి కార్ విభాగం సక్సెస్ అవడంతో ఇప్పుడు అదే సూపర్ టెక్నాలజీతో కాప్చర్ వెహికల్ రిలీజ్ చేస్తున్నారు. రెనాల్ట్ లో డస్టర్, క్విడ్ లాంటి వెహికల్స్ కస్టమర్స్ ను సాటిస్ఫై చేయగా ఆ కోవలోనే వస్తుంది ఈ కాప్చర్.
ఇకఈ కాప్చర్ వెహికల్ అన్ని మేజర్ సిటీస్ లో అందుబాటులో ఉంటుంది. రెనాల్ట్ డీలర్ షిప్ ఉన్న అన్ని ప్రదేశాల్లో ఈ కాప్చర్ వెహికల్ రిలీజ్ చేస్తున్నారు. 1.5 లీటర్ 1461 సిసి కెపాసిటీతో వస్తున్న ఈ వెహికల్ 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్ తో వస్తుంది. ఇక ఇదే విధంగా 4 సిలిండర్ పెట్రోన్ ఇంజిన్ తో కూడా ఈ వెహికల్ అందుబాటులో వస్తుంది. 5, 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమెటెడ్ ట్రాన్స్ మిషన్స్ తో ఈ వెహికల్ వస్తుంది.