మారుతి సుజుకి నుండి వచ్చిన స్విఫ్ట్ మారుతి కార్ల సేల్స్ ఎంతగా పెంచిందో తెలిసిందే. దేశీయ మార్కెట్ లో స్విఫ్ట్ కార్ల హవా కొనసాగుతూనే ఉంది. అయితే సెకండ్ జెనరేషన్ స్విఫ్ట్ కార్లను నిలిపేసిన మారుతి ఇప్పుడు కొత్త స్విఫ్ట్ కారుని రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. 2018లో అధునాతన టెక్నాలజీతో రాబోతున్న మారుతి స్విఫ్ట్ కార్లు మరింత ప్రియం కానున్నాయి. పాత మోడల్ కన్నా కేవలం 10వేల ఎక్కువ ప్రైజ్ తో ఇవి వస్తున్నాయి.
ప్రస్తుతం రాబోతున్న స్విఫ్ట్ పెట్రోల్ వేరియెంట్ ప్రైజ్ 4.99 లక్షలుగా నిర్ణయించారు. ఇక దీనిలో డీజిల్ వేరియెంట్ టాప్ రేంజ్ జెడ్.డి.ఐ డీజిల్ వేరియెంట్ అయితే 7.99 లక్షలుగా నిర్ణయించారట. ఇక సరికొత్తగా మార్కెట్ లోకి రిలీజ్ అవుతున్న ఈ మారుతి స్విఫ్ట్ మోడల్ ప్రస్తుతం ఉన్న హ్యుండై గ్రాండ్ ఐ10, ఫోర్డ్ ఫిగోలను దాటేస్తుందని అంటున్నారు. మార్కెట్ లో ఎన్నో స్విఫ్ట్ పోలిన వాహాలు వస్తున్నా స్విఫ్ట్ ఎప్పటికి స్విఫ్టే కాబట్టి కొత్త అప్డేట్స్ తో కస్టమర్స్ కు మరింత సౌకర్యవంతం కానుంది మారుతి స్విఫ్ట్.