దేశీయ దిగ్గజ టూ వీలర్ మోటార్ సంస్థ బజాజ్ నుండి మరో కొత్త బజాజ్ డిస్కవర్ ఇప్పుడు 110 సిసి కెపాసిటీతో మార్కెట్ లోకి రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం డిస్కవర్ 125 సిసి కెపాసిటీతో వస్తున్న బైక్ లు మార్కెట్ లో ఉన్నాయి. వాటికి కాస్త తక్కువ సిసితో ఈ బైక్ వస్తుంది. అయితే ఈ సరికొత్త బజాజ్ 110 సిసి డిస్కవర్ బైక్ బజాజ్ ప్లాటినా 110 సిసి బైక్ ల స్థానం బర్తి చేయాలన్న ఆలోచనతోనే ఈ బైకులను రిలీజ్ చేస్తున్నారట.
అయితే ఇంజిన్ కెపాసిటీలో తేడా తప్ప బైక్ మాత్రం చూసేందుకు బజాజ్ డిస్కవర్ 125 సిసి బైక్ లానే ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇక వీటితో పాటుగా అల్లాయి వీల్స్, డిజిటల్ అన్ లాగ్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ తో ఈ బైక్ వస్తుంది. అయితే ఈ బైక్ ఎలాంటి అదనపు ఫ్యూచర్స్ లేకుండా వస్తుంది. ఎలెక్ట్రిక్ ఇంజిన్ తో వస్తున్న ఈ బైక్ 4 స్పీడ్ గేర్ బాక్స్ తో పాటు డిటిఎస్-ఐ టెక్నాలజీతో గాలితో చల్లబడే ఇంజిన్ కలిగి ఉంటుంది.
ఇక 8.5 పిఎస్, 9.5 ఎన్నెం టార్క్ తో పవర్ తో ఈ ఇంజిన్ నడుస్తుంది. ఇక ఈ సరికొత్త డిస్కవర్ 110 సిసి క్మ్యూటర్ బైక్ ధర 50,500లుగా నిర్ణయించారు. మరి మైలేజ్ విషయంలో రాజీ పడని ఈ సరికొత్త బజాజ్ డిస్కవర్ 110 సిసి బైక్ కచ్చితంగా కస్టమర్స్ కు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పొచ్చు.