బజాజ్ బైక్స్ లో బాగా పాపులర్ అయిన పల్సర్ డిఫరెంట్ వేరియంట్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం బజాజ్ పల్సర్ 150 సింగిల్ చానెల్ ఏబిఎస్ సిస్టెం తో కొత్త బైక్ రిలీజ్ చేస్తున్నారు. 85,000 ఎక్స్ షోరూం ప్రైజ్ తో ఈ బైక్ అందుబాటులోకి రానుంది. ఈ సరికొత్త బజాజ్ పల్సర్ 150లో రివైండ్ చేయబడిన గ్రాఫిక్స్ తో పాటుగా రెండుగా విభజించిన సీటు వస్తుంది.


ఇక ఈ బైక్ మూడు కలర్స్ లో రిలీజ్ అవుతుంది. బ్లాక్-బ్లాక్, బ్లాక్-రెడ్, బ్లాక్-క్రోం కలర్స్ లో పల్సర్ 150 ఏబిఎస్ వెహికల్ వస్తుంది. ఇప్పటికే బుకింగ్స్ స్టార్ట్ అయిన ఈ బైక్స్ వెంటనే డెలివరీ ఇచ్చేస్తున్నారు. 125 సిసి అంతకన్నా ఎక్కువ సిసి కెపాసిటీతో వచ్చే బైకులకు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టెం అమలు చేసేలా ప్రభుత్వం రూల్స్ పెట్టింది.


బజాజ్ 150 పల్సర్ ఈ సరికొత్త బైక్ కు రేర్ డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తుంది. 150 సిసి కెపాసిటీతో వస్తున్న ఈ బైక్ 14 పి.ఎస్ పవర్, 13.4 ఎన్.ఎం టార్క్ తో వస్తుంది. 5 స్పీడ్ గేర్ బాక్స్ తో ఈ వెహికల్ వస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: