బజాజ్ నుండి మరో సరికొత్త మైలేజ్ బైక్ రిలీజ్ అయ్యింది. బజాజ్ డిస్కవర్ 110 సిబిఎస్ లాంచ్ అయ్యింది.. కంబైనెడ్ బ్రేకింగ్ సిస్టెం తో ఈ బైక్ వస్తుంది. ఇక దీని ధర విషయానికొస్తే 53,273 రూపాయల్ ఎక్స్ షోరూం ప్రైజ్ తో ఇది అందుబాటులోకి వస్తుంది. నాన్ సిబిఎస్ బైక్ ధరకు కేవలం అధికంగా 563 రూపాయలతో ఈ బైక్ లభిస్తుంది. 


115 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో 8.6 బి.హెచ్.పి పవర్, 9.81 ఎన్.ఎం టార్క్ తో ఈ బైక్ వస్తుంది. ఇక ఈ బైక్ ట్యాంగ్ 8 లీటర్ల ఫ్యూయెల్ కెపాసిటీ కలిగి ఉంటుంది. ఇక ఈ బైక్ మార్కెట్ లో ఉన్న హోండా సిడి 110 డ్రీం, హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్ 110, టివిఎస్ విక్టర్ లకు మంచి పోటీ ఇస్తుంది. 


బజాజ్ డిస్కవర్ బైక్ కొనాలనుకునే వారికి కొత్తగా వచ్చిన బజాజ్ డిస్కవర్ 110 సిబిఎస్ మంచి మైలేజ్ తో వస్తుంది. దేశీ మోటార్ కంపెనీలలో బెస్ట్ మైలేజ్ బైకులుగా బజాజ్ అగ్రస్థానంలో ఉంది. సిసి తక్కువే అయినా మైలేజ్ కు ప్రాధాన్య ఇచ్చే వారికి ఈ బైక్ బాగా నచ్చుతుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: