టాటా నుండి వచ్చిన లక్సరియస్ ఎస్.యు.వి మోడల్ వెహికల్ టాటా హ్యారియర్ ధర పెరిగినట్టు తెలుస్తుంది. టాటా హ్యారియర్ అసలు ధర 12.99 లక్షలు ఉండగా దాన్ని ఇప్పుడు 16.55 లక్షలు దాకా పెంచారని తెలుస్తుంది. టాటా హ్యారియర్ నాలుగు వేరియెంట్ మోడల్ లో అందుబాటులో ఉంది. ఎస్.యు.వి ఎక్స్.ఈ, ఎక్స్.ఎం, ఎక్స్.టి, ఎక్స్.జెడ్ ఇలా అన్ని వేరియెంట్స్ కు ధరలు పెరగడం జరిగింది.


టాటా హ్యారియర్ 2.0 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ తో అందుబాటులో ఉంటుంది. 140 బి.హెచ్.పి, 350 ఎన్.ఎం టార్క్ పవర్ తో ఇంజిన్ సామర్ధ్యం ఉంటుంది. 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో ఇది అందుబాటులో ఉంటుంది. టాటా హ్యారియర్ వెహికల్ ఈ ఇయర్ జనవరి నుండి ఏప్రిల్ వరకు యావరేజ్ గా నెలకు 1609 యూనిట్స్ అమ్ముడయినట్టు తెలుస్తుంది.


టాటా నుండి వచ్చిన లక్సరియస్ వెహికల్ లో హ్యారియర్ మంచి సేల్స్ కలిగి ఉంటుంది. సౌకర్యవంతమైన ప్రయాణం కోసం టాటా కస్టమర్స్ హ్యారియర్ కు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇక పెరిగిన ధర కాస్త భారం అవుతున్నా టాటా హ్యారియర్ అన్ని వేరియెంట్స్ కు మంచి రెస్పాన్స్ ఉంది. పెరిగిన ధరలు వీటి సేల్స్ మీద ఏమాత్రం ప్రభవం చూపిస్తాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: