మహీంద్ర అండ్ మహీంద్ర మోటార్ కంపెనీ ప్యాసెంజర్ కార్ల ధరలను పెంచుతున్నట్టు తెలుస్తుంది. పెంచిన వాహన ధరలు జూలై 1 నుండి అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ 145 సెక్యురిటీ రూల్స్ అమలు చేయడం వల్ల కార్ల ధరలను పెంచాల్సి వచ్చిందని అంటున్నారు.


మహీంద్రా కార్ల ధరలు 36,000 ల దాకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక నుండి ఇండియాలో అన్ని కార్లకు ఏ.ఐ.ఎస్ 145 సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. అలా ఉన్న వాటికే 5 స్టార్ రేటింగ్ ఇస్తారు. 2020 సంవత్సరం నాటికి రోడ్డు ప్రమాదాలు 50 శాతం వరకు తగ్గించాలన్న ఉద్దేశంతో భద్రతా ప్రమాణాలను పాటించాలని ప్రభుత్వం సూచనలను ఇస్తుంది. 


ప్రస్తుతం మహీంద్రా వెహికల్స్ ఎక్స్.యు.వి 300, ఫ్లాగ్ షిప్ వెహికల్ ఆల్తురాయిస్ జీ4 వెహికల్స్ కు ఇప్పటికే సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. అయితే వీటి కోసం ధరలను పెంచుతున్నట్టు తెలుస్తుంది. థార్ 700 వెహికల్ కు మాత్రం ధర పెంచడం లేదట. వినియోగదారుల భద్రత దృష్ట్యా మహీంద్ర అండ్ మహీంద్రా ఈవిధంగా తమ వెహికల్స్ ను సిద్ధం చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: