మన దేశంలో ఒకప్పుడు ప్రత్యేక ప్రతిపత్తి గల రాష్ట్రం కాశ్మీర్ . మనం దేశం అంతటిలో ఒకజెండా ఎగిరితే అక్కడ ఒక జెండా ఎగిరేది . 370 ఆర్టికల్ ద్వారా కాశ్మీర్ ప్రత్యేక ప్రతి పత్తి కలిగి ఉండేది . అయితే దేశ ప్రధాని నరేంద్ర మోడీ సాహసోపేతమైన నిర్ణయం తో 370 ఆర్టికల్ ని రద్దు చేసి ... దేశంలో అన్ని రాష్ట్రాల్లో అమలు జరిగే చట్టాలు కాశ్మీర్ లో కూడా అమలయ్యేలా నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు . ఈ ఆర్టికల్ రద్దు నేపథ్యంలో కాశ్మీర్ ఎన్నో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా ఇప్పుడిప్పుడే అక్కడ ప్రశాంత వాత వరణం నెలకొంటుంది .
370 ఆర్టికల్ రద్దు విషయంలో భారత్ తో యుద్ధం చేస్తామంటూ కొన్ని రోజులు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలనం వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే . అయితే 370 ఆర్టికల్ రద్దు తర్వాత అందరి నోటినుండి ఒకటే మాట వెలువడుతుంది .పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని .అయితే ఇప్పటికే దేశ ప్రజలు ... నాయకుల నోటా ఇదే మాట అంటున్నారు . పాక్ ఆక్రమిత కాశ్మీర్ సొంతం చేసుకోవటమే తమ తర్వాతి లక్ష్యం అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే .
ఈ అంశం పై ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పందించారు. తాము దేనికైనా సిద్దమే అని ... పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు . ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉంటామన్నారు . ప్రభుత్వం నిర్ణయం కోసమే ఎదురు చూస్తున్నట్లు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు .