ఒకసారి ఆట మొదలెడితే ఆపటం ఎవ్వరి తరము కాదు... ఆటలో విజయం కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. ఆటలో కాలు పెడితే చంపటం లేదా చావటం మాత్రమే ఉంటాయి. నేనేదో స్పోర్ట్స్ గురుంచి మాట్లాడుతున్న అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే... నేను చెప్పేది అందరిని తన బానిసలుగా మార్చుకుని పట్టిపీడిస్తున్న మాయదారి పబ్ జి గేమ్ గురుంచి. ప్రపంచంలో బాగా ఫెమస్ అవుతున్న గేమ్ అని ఆట స్టార్ట్ చేస్తే... ఇది మిమ్మల్ని ప్రపంచానికి దూరం చేస్తుంది. ఈ గేమ్ ఆడనివ్వకుండా ఎవరైనా అడ్డుకుంటే వాళ్ళ ప్రాణాలను తీసేలా  చేస్తుంది. ఈ గేమ్ ఎక్కువగా ఆడితే ఆటాడుతున్న వాళ్ళ ప్రాణాలనే గాల్లో కలిపేస్తుంది.

 

 

అయితే పబ్ జి  వల్ల ఇప్పటికే చాలా మంది పిచ్చివాళ్ళలా తయారు అవ్వగా...  కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆయన పబ్ జి గేమ్ ని  మాత్రం వదలటం లేదు పబ్జి ఆడేవాళ్లు. తాజాగా జరిగిన ఘటన చూస్తే ఇంకా పబ్జి పిచ్చి ఎంత ఉందో అర్థం అవుతుంది. 

 

కర్ణాటకలోని విజయనగరంలో ఓ యువకుడు చెత్తా చెదారంతో నిండిపోయి కంపుకొడుతున్న మురికి కాలువలో  దిగి ఈత కొడుతున్నాడు. ఇది చూసిన స్థానికులు వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా ఇలా ప్రవర్తిస్తున్నాడు అనుకున్నారు. అయితే ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. కాగా రంగంలోకి దిగిన పోలీసులు పక్కనే ఉన్న స్నేహితులను అడిగితే అసలు విషయం బయటకు వచ్చింది. ఆ యువకుడికి మాములు  పిచ్చి కాదు మాయదారి పబ్జి గేమ్ పిచ్చి అని. స్నేహితులతో కలిసి పబ్జి గేమ్ ఆడిన యువకుడు... గేమ్ లో ఓడిపోతే మురికి కాలువలో ఈతకొడుత అని పందెం  వేశాడు. దీంతో గేమ్ లో ఓడిపోవడంతో పందెం ప్రకారం మురికి కాలువలో ఈత కొట్టాడు . ఇది తెలుసుకున్న స్థానికులు ఆశ్చర్యపోయారు.పబ్ జి  గేమ్ వల్ల ఇలాంటి ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయని... పబ్జి నిషేధించాలని  కర్ణాటక బెలగావి సంస్థ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: