బంగారు ఆభరణాలు అంటే మహిళలకు ఎంతో ఇష్టమో  కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ కొత్త కొత్త జ్యువలరీలు ధరించడానికి మహిళలు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తుంటారు . బంగారం వేసుకోవడం ద్వారా వాళ్ళ అందం రెట్టింపు అవుతుందని మహిళలు భావిస్తారు. అలాంటి వాళ్ళకి  బంగారం కొనడానికి ఇదే అనువైన సమయం అని చెప్పవచ్చు. ఎందుకంటే బంగారం ధరలు తగ్గనున్నాయి . ఓవైపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకుల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా అమెరికా రిజర్వ్  25 బేసిస్ పాయింట్లు తగ్గించ గా.... మరోవైపు బంగారం,  ఇతర విలువైన రాళ్లకు ఈ-వే  బిల్ సిస్టం ప్రవేశపెట్టాలని జీఎస్టీ కౌన్సిల్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 

 

 

 అయితే అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు పుంజుకోవడం కూడా బంగారం ధర తగ్గడానికి కారణమవుతుంది . ఈక్విటీ మార్కెట్లు పుంజుకోవడంతో మదుపుదారులు అందరూ ఈక్విటీ  మార్కెట్లపై పెట్టుబడి  పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో బంగారంపై పెట్టుబడులు తగ్గాయి. అయితే బంగారం కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. అయితే బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం దీర్ఘకాలికం  కాదని... ఈక్విటీ మార్కెట్లు కుదేలైనప్పుడు... మదుపుదారులు మళ్ళీ బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారని దాంతో  మళ్లీ బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. అయితే పండుగల నేపథ్యంలో తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు పసిడి ప్రియులను ఆకర్షిస్తున్నాయి.

 

 

న్యూయార్క్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1500  డాలర్ల వద్ద అటు ఇటు గా ట్రేడ్  అవుతూ ఉండడంతో... బంగారంపై పెట్టుబడి పెట్టడానికి మదుపుదారులు కాస్త ఆలోచించాలని... అవసరం కోసం నగలు చేయించుకునే వారు మాత్రమే కొనుగోలు చేసుకోవచ్చని  నిపుణులు భావిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: