కొన్నాళ్లుగా కె.టి.ఎం నుండి ఎదురుచూస్తున్న అడెంచర్
బైక్ 390 ఎట్టకేలకు ఇండియన్
మార్కెట్ లోకి రిలీజ్ కాబోతుంది. ఐక్మా
2019 మోటర్ షోలో ఈ
బైక్ ప్రదర్శనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కె.టి.ఎం నుండి వచ్చే 390
బైక్ కోసం కొన్నాళ్లుగా కష్టమర్స్ వెయిట్ చేస్తున్నారు. 390 డ్యూక్ స్ట్రీట్ ఫైటర్
బైక్ కు ఆఫ్ రోడ్ వర్షన్ గా కె.టి.ఎం 390 వస్తుంది.
ఈ ఇయర్
డిసెంబర్ లో ఈ
బైక్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. 373.22 సిసి కెపాసిటీతో 44 బి.హెచ్.పి పవర్, 37 ఎన్.ఎం టార్క్ ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. 6 స్పీడ్ గేర్ బాక్స్ తో ఈ
బైక్ వస్తుంది. బి.ఎస్-6 ప్రమాణాలతో వచ్చే తొలి కె.టి.ఎం
బైక్ 390 అడ్వెంచర్ అని చెప్పొచ్చు.
14.5
పెట్రోల్ టాంక్ తో వస్తున్న ఈ
బైక్ 158 కేజిల బరువు కలిగి ఉంటుంది. త్వరలో ఇండియ రోడ్ల మీద కె.టి.ఎం 390 అడ్వెంచర్
బైక్ తిరుగుతుంది. కె.టి.ఎం డ్యూక్ కు అప్డేటెడ్ వర్షన్ గా ఈ సరికొత్త 390 అడ్వెంచర్
బైక్ సరికొత్తగా రాబోతుంది. మరి కె.టి.ఎం లవర్స్ కు ఈ కొత్త
బైక్ ఏ రేంజ్ లో నచ్చుతుందో చూడాలి.