బహు భాషా నటిగా, గాయనిగా, రచయితగా బహుముఖ ప్రజ్ఞాశాళిగా సౌత్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న అందాల
భామ ఆండ్రియా జెరెమియా. పాత్ర డిమాండ్ చేస్తే బోల్డ్ గా నటించేందుకు కూడా రెడీ అనే ఆండ్రియా, తన వ్యక్తిగత జీవితంలోనూ అంతే బోల్డ్‌గా ఉంటుంది. ఇటీవల సినిమాలకు కాస్త దూరంగా ఉంటోంది ఈ భామ. చివరగా వడచెన్నై సినిమాలో నటించిన ఆండ్రియా ఆ తరువాత తెర మీద కనిపించలేదు.
ఆండ్రియా జెరెమియా ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఈ
బ్యూటీ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తనకు ఓ పెళ్ళైన వ్యక్తితో ఉన్న సంబంధం కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా వెల్లడించింది ఆండ్రియా. అంతేకాదు అతనితో రిలేషన్ తరువాత బ్రేక్‌తో శారీరకంగానూ, మానసికంగానూ ఎన్నో వేదన అనుభవించినట్లుగా తెలిపింది. ఇప్పుడిప్పుడే ఆ బాధనుంచి బయటపడుతున్నానని,
ఆయుర్వేద చికిత్స ద్వారా ఉపశమనం పొందుతున్నట్లుగా పేర్కొంది.
అయితే ఆ ఇంటర్వ్యూలో తనను ఇబ్బంది పెట్టిన ఆ వ్యక్తి ఎవరన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు ఆండ్రియా. అతను ఎవరని తను రాసిన బుక్‌లో వెల్లడిస్తానని చెప్పింది. అయితే ఆ పుస్తకం చాలా రోజులుగా విడుదలకు నోచుకోలేదు. ఆండ్రియాను ఇబ్బంది పెట్టిన వ్యక్తి బెదిరించటం వల్లే ఆ పుస్తకం విడుదల చేయలేదన్న ప్రచారం జరుగుతోంది. ఆండ్రియాను ఇబ్బంది పెట్టిన వ్యక్తి సినీ రంగానికి చెందిన వాడని, ఆయనకు రాజకీయ ప్రముఖులతోనూ సన్నిహిత సంబంధాలు ఉండటంతో పుస్తకం రిలీజ్ కాకుండా ఆగిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ పుస్తకం ఇక ఎప్పటికీ బయటకు రాకపోవచ్చన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
మానసిక, శారీరక సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఆండ్రియా సినిమాల మీద దృష్టి పెట్టింది. ప్రస్తుతం కావట్టం, మాళిగై చిత్రాల్లో నటిస్తున్న ఈ
బ్యూటీ కోలీవుడ్ టాప్
హీరో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న నెక్ట్స్ సినిమాలో కీలక పాత్రల్లో నటించనుంది. అయితే ఈ సినిమాలో ఆండ్రియా చేస్తున్న హీరోయిన్ రోల్ కాదు. కీలక సమయంలో వచ్చే ఇంపార్టెంట్ రోల్‌లో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.