రాయల్ ఎన్ఫీల్డ్.. ఈ బండి కొనాలి అనేది ఎంతోమంది మధ్యతరగతి యువకుల కల ఇది.. కొనాలి అని ఉన్న సరే.. ధర చూసి వెనకడుగు వెయ్యాలి.. ఎందుకంటే మధ్య తరగతి తండ్రి 6 నెలలు సంపాదన ఆ బైక్ ఖరీదు. అయినప్పటికీ ఆ బైక్ ని చూడటానికి.. ఆ బైక్ లో వచ్చే కొత్త మోడల్స్ చూడటానికి యువకులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఇంకా అసలు విషయానికి వస్తే మనదేశంలో అమ్మాయిల నుండి అబ్బాయిల వరుకు ప్రతి ఒక్కరు ఇష్టపడే రాయల్ ఎన్ఫీల్డ్ సంస్ద నుండి మరో కొత్త బైక్ వస్తుంది. ఆ బైక్ చూస్తే వావ్ అనాల్సిందే. ఆలా ఉంది ఆ బైక్. అసలు ఆ బైక్ ఏంటి అనుకుంటున్నారా ?

 

అదే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయ కొత్త పాపులర్ మోడల్‌ ను కొత్త ఉద్గార నిబంధనలకనుగుణంగా తయారు చేసింది. బీఎస్‌-6 ఇంజిన్‌తో ఈ బండిని ఈరోజు సోమవారం లాంచ్‌ చేసింది. ఈ బండి ప్రారంభ ధర 1.86 లక్షల రూపాయిలు. ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ మూడు రంగాలలో కనిపించనుంది. ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ లో 411 సీసీ ఇంజీన్‌, 24.3 బీహెచ్‌పీ పవర్‌, 32 ఎన్‌ఎం టార్క్‌ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.

 

దినికి మూడేళ్లు వారంటీ ప్యాకేజీ ఉండగా.. బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ బైక్ అడ్వెంచర్ టూరర్ గా 2016 నుండి, హిమాలయ బైక్స్‌ జాతీయంగా అంతర్జాతీయంగా ఆదరణ పొందాయని రాయల్ ఎన్‌ఫీల్డ్‌ సీఈవో వినోద్ దాసరి ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఈ బైక్స్ ఎంతో అద్భుతంగా ఉంటున్నాయి.. అయితే ఈ బైక్ ను కేవలం బాగా రిచ్ వాళ్ళు మాత్రమే కొనగలరు.. అంత కాస్టలీ ఉన్నాయి.. మధ్యతరగతికి అందనంత దూరంలో ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ధరలు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: