ఈ మధ్యకాలంలో వాహనాలపై భలే ఆఫర్స్ ఉంటున్నాయి. అన్ని అతి తక్కువ ధరకే వస్తున్నాయి. అన్ని అంటే అన్ని రావు లెండి.. కొంచం ఓల్డ్ మోడల్ అయ్యాక.. ఆర్డర్స్ తక్కువ అయినప్పుడు మనకు ఈ బంపర్ ఆఫర్లు ఇవ్వడం మాములు విషయమే. అయితే ఇప్పుడు అది అంత కాదు.. లాంచింగ్ ఏ అతి తక్కువ ధరకు చేశారు. 

 

''హీరో ప్లెజర్ ప్లస్ 110'' ధర తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు.. ఎంత అంటే? హీరో ప్లెసర్ ప్లస్ 110 ఎఫ్‌ఐ బిఎస్-6 భారతదేశంలో రూ .54,800 నుంచి రూ .56,800 మధ్య లాంచ్ అయింది. ఆల్-న్యూ ప్లెసర్ ప్లస్ ఎఫ్ఐ బిఎస్ 6 రెండు వేరియంట్లలో వస్తుంది. అయితే ఈ స్కూటర్ల కోసం బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. 

 

కొత్త ప్లెజర్ ప్లస్ 110 బిఎస్ 6 మోడల్స్ రాజస్థాన్ లోని జైపూర్ వద్ద ఉన్న హీరో మోటోకార్ప్ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఫెసిలిటీ సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీలో అభివృద్ధి చేశారు. అయితే ఈ బైక్స్ లో రెండు కొత్త వేరియంట్లలో వస్తాయి. అయితే అందులో ఒకటి స్టీల్ వీల్స్, రెండవది అల్లాయ్ వీల్స్. 

 

ఇంకా స్టీల్ వీల్స్ స్కూటర ధర రూ. 54,800, అల్లాయ్ వీల్స్రూ స్కూటర్ ధర 56,800 ఉంది. అయితే ఈ స్కూటర్లు ఏడు రంగులలో వాహనదారులకు లభిస్తాయి. ఆ రంగులు ఏవి ఏవి అంటే అవి గ్లోసీ బ్లాక్, గ్లోసీ బ్లూ, గ్లోసీ రెడ్, గ్లోసీ వైట్, మాట్టే యాక్సిస్ గ్రే, మాట్టే గ్రీన్ మరియు మాట్టే రెడ్ రంగులలో ఈ వాహనాలు కనిపిస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ బైక్స్ ను బుక్ చేసుసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: