భారత్ మార్కెట్లో హ్యుందాయ్ సంస్దకు మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటి ఫాలోయింగ్ ఉన్న ఈ సంస్ద నుండి కొత్త తరం హ్యుందాయ్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును త్వరలోనే లాంచ్ చేయనుంది.. దీని లాంచింగ్ కి కావాల్సిన సన్నాహాలను ఇప్పటికే ప్రారంభించింది హ్యుందాయ్.
అయితే ఈ ఆల్-న్యూ హ్యుందాయ్ ఐ20కు సంబంధించి ఇటీవలే కొత్త టీజర్ రిలీజ్ అయ్యింది. అయితే ఈ ఆల్-న్యూ హ్యుందాయ్ ఐ20 మారుతి బాలెనో, టయోటా గ్లాంజా కార్లకు గట్టి ఇవ్వనుంది.. ఈ కారు మరో నెల రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 2020 జెనీవా మోటార్ షోలో అంతర్జాతీయంగా ఈ లంచ్ చెయ్యనున్నారు.
ఈ హ్యుందాయ్ కొత్త డిజైన్ లో సరికొత్త హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఇంటీరియర్‌లో విశాలమైన క్యాబిన్ వచ్చింది. ఇంటీరియర్ మొత్తం లగ్జరీ ఫీలింగ్ ఇచ్చే ప్రీమియం ఫినిషింగ్స్ వచ్చాయి. హ్యుందాయ్ క్రెటాలో ఉన్నటువంటి అతి పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్ సిస్టమ్ ఇందులో వస్తోంది. అయితే ఈ కారు ధర ఇంతవరుకు ప్రకటించలేదు.