అతి తక్కువ ధరకే అదిరిపోయే స్కూటర్.. అబ్బా టైటిల్ బానే పెట్టారు.. కానీ అక్కడ అంత తక్కువ ధర ఏం ఉండదు అని అనుకుంటే పప్పులోకి కాలు వేసినట్టే.. నిజంగానే ఈసారి అతి తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లతో స్కూటర్ విడుదల అయ్యింది.. అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా లేకుండా డ్రైవ్ చేస్తున్న ఈ స్కూటర్ అతి తక్కువ ధరకే వస్తుంది.
ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హోండా సంస్థ తన కొత్త 'డియో స్కూటర్'ను లాంచ్ చేసింది. బీఎస్6 నిబంధనలకు అనుగుణంగా ఈ స్కూటర్ ను రూపొందించారు.. చూడటానికి ఎంతో అందంగా అద్భుతమైన ఫీచర్లతో యువతను ఆకర్షిస్తుంది ఈ బైక్. ఇంకా మనం పైన చెప్పుకున్నారు ఈ స్కూటర్ నిజంగానే అతి తక్కువ ధరకు వస్తుంది.
హోండా డియో రెండు వేరియంట్లలో వస్తుంది. అయితే ఢిల్లీ ఎక్స్ షోరూంలో దీని ప్రారంభం ధర రూ.59,990లుగా సంస్థ నిర్దేశించింది. హోండా డియో 59 వేల రూపాయిలు ఉండగా.. డీలక్స్ వేరియంట్ ధర రూ.63,340గా ఉంది. ఇంకా ఇందులో ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి. హోండా డియో మోడల్లో ఫీచర్లు అప్ డేట్ అయ్యాయి.. ఇంకా ఈ స్కూటర్లు ఐదు రంగుల్లో అందుబాటులోకి రానుంది. అది ఏ కలర్లు అంటే గ్రే, నీలం, ఎరుపు, కాషాయం, ముదురు ఎరుపు లాంటి రంగులలో ఈ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. ఇంకా ఈ స్కూటర్ కు ఆరు సంవత్సరాలు వారంటీ ఇచ్చింది హోండా సంస్ద.. ఏది ఏమైనా ప్రస్తుతం అతి తక్కువ ధరలకు లభిస్తున్న స్కూటర్ ఏదైనా ఉంది అంటే అది ఇదే...