రాయల్ ఎన్‌ఫీల్డ్ .. ఎంతోమంది మధ్యతరగతి యువకుల కల ఇది.. కొనాలి అని ఉన్న సరే.. ధర చూసి వెనకడుగు వెయ్యాలి.. ఎందుకంటే మధ్య తరగతి తండ్రి 4 నెలలు సంపాదన ఆ బైక్ ఖరీదు. అయినప్పటికీ ఆ బైక్ ని చూడటానికి.. ఆ బైక్ లో వచ్చే కొత్త మోడల్స్ చూడటానికి యువకులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. 

 

ఈ నేపథ్యంలోనే మరో కొత్త మోడల్ అందుబాటులోకి వచ్చింది. ఆ మోడల్ ఏంటి అంటే ? అది ఇప్పుడు ఖచ్చితంగా చెప్పలేం.. కానీ ఆ మోడల్ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ లేదా మహిళల కోసం.. లేదా యువ రైడర్స్ కోసం ప్రత్యేకంగా తయారు చేసినా రాయల్ ఎన్ఫీల్డ్ అని మాత్రం చెప్పగలం.. ఎందుకంటే.. ఈ కొత్త మోడల్ అతి తక్కువ బరువు ఉంది. 

 

రాయల్ ఎన్ఫీల్డ్..  క్లాసిక్, థండర్బర్డ్, థండర్బర్డ్ఎక్స్ వంటి సింగిల్-సిలిండర్ 350 శ్రేణి కొత్త మోడల్స్ పనిలో ఉంది అని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ బైక్ ఏప్రిల్ నెలకు ముందే బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా రానుంది. దీని పూర్తి ఫీచర్స్ అన్ని కూడా త్వరలోనే తెలియనున్నాయి. ఇంకా వచ్చే వాహనాలు అన్ని కూడా బిఎస్ 6 వెర్షన్లతో రానున్నాయి అని సమాచారం. మరి ఈ కొత్త బైక్ ఫీచర్స్ ఎప్పుడు బయటకు వస్తాయి అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: