ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా అన్ని యాక్సిడెంట్లు తక్కువ అయ్యాయి కానీ లేకపోతే ఎలా ఉంటాయి? మనం ఎంత జాగ్రత్తగా వెళ్లిన మన ముందు వచ్చేవాడు జాగ్రత్తగా వస్తాడు అనే నమ్మకం లేదు.. ఇంకా అలాంటి ఈ సమయంలో మనం కూడా కూడా ఆఫీస్ కు త్వరగా వెళ్ళాలి అని ఎలా అంటే అలా మన బండిని నడుపుతాం.. దీని వల్ల కొన్ని కొన్ని సార్లు మనం చేరాల్సిన గమ్యం బదులు ఆస్పత్రిలో చేరాల్సి వస్తుంది.
అయితే అలా కాకుండా.. అతి తక్కువ ధరలోనే ఎక్కువ భద్రతా ఉండే కార్లు ఇప్పుడు ఆటో మార్కెట్ లోకి వచ్చాయి. అయితే ఏ కారు ఎంత తక్కువ ధరలో ఎంత భద్రతా ఇస్తుంది అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. కేవలం పది లక్షలలోనే మంచి కార్ ను కొనుగోలు చెయ్యండి.
మహీంద్ర ఎక్స్ యూవీ300..
మహీంద్ర ఎక్స్ యూవీ300 మోడల్.. ఈ కారు భద్రత పరంగా 5 కు 5 రేటింగ్ పొందింది.. అంతేకాదు గ్లోబల్ ఎన్ సీఏపీలోనూ ఈ కారు 4 స్టార్ల రేటింగ్ సొంతం చేసుకుంది. ఇంకా ఈ మహీంద్రా ఎక్స్ యువీ 300 కారు ఎక్స్ షోరూంలో ధర రూ.8.10లక్షల నుండి రూ.12.69లక్షల వరకు అందుబాటులో ఉంది.
టాటా ఆల్ట్రోజ్..
టాటా ఆల్ట్రోజ్.. ఈ కారో కొత్తగా మార్కెట్లోకి వచ్చింది.. ఈ కారుకు భద్రతా పరంగా ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు.. అడల్ట్ అక్యూపెంట్ ప్రొటెక్షన్, చైల్డ్ అక్యూపెంట్ ప్రొటెక్షన్ లో 5 స్టార్లకు 4 స్టార్ల రేటింగ్ దక్కించుకుంది. ఇంకా ఈ కారు ధర ఎక్స్ షోరూంలో రూ.5.29లక్షల నుంచి 9.29లక్షల మధ్య ఉండనుంది.
టాటా నెక్సాన్..
టాటా నెక్సాన్ కారు అడల్ట్ ఆక్యూపెంట్ ప్రొటెక్షన్ లో 5 స్టార్స్ కు 5 స్టార్స్ రేటింగ్ పొందింది.. ఇంకా చైల్డ్ అక్యూపెంట్ ప్రొటెక్షన్ లో మూడు స్టార్లు సొంతం చేసుకుంది. ఇంకా ఈ కారు ఎక్స్ షోరూంలో టాటా నెక్సాన్ ధర రూ.6.95లక్షల నుంచి 12.70లక్షల మధ్య ఉంది.
చూశారుగా.. భద్రతా పరంగా.. కారు ధర పరంగా మధ్య తరగతి వారికీ అందుబాటులో ఉన్నాయి.