అతి తక్కువ ధరలోనే అదిరిపోయే కార్లు దొరకడం ప్రస్తుత కాలంలో చాల అరుదు. అయితే మనం పెట్టె డబ్బుకు అద్భుతమైన బ్రాండెడ్ కార్లు వస్తాయి. అయితే ఆ కార్లు ఏంటి ? అంతేకాదు.. ఇండియాన్ఆటో.కామ్ లో సెకండ్ హ్యాండ్ బీఎండబ్ల్యూ కార్లు 20 లక్షల రూపాయల కంటే తక్కువ ఖరీదుకే దొరుకుతున్నాయి.. ఆ కార్లు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.
బీఎండబ్ల్యూ 7-సిరీస్..
2019లో బీఎండబ్లూ 7-సిరీస్ మోడల్ ను జర్మన్ ఆటోమేకర్ అప్డేట్ చేసిందీ. ఇంకా ఈ సరికొత్త మోడల్ ధర కోటి 22 లక్షల రూపాయిల 3కోట్ల మధ్యలో ఉండే అవకాశం ఉంది. అయితే ఈ కారు సెకండ్ హ్యాండ్ లో 20 లక్షల కంటే తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది. ఇంకా ఈ కారు గంటకు 58 కిలోమీటర్ల వరకు రేంజ్ ఉంటుంది.
బీఎండబ్ల్యూ 3-సిరీస్..
ఈ సరికొత్త బీఎండబ్ల్యూ 3-సిరీస్ లో ఫీచర్లలో అద్భుతం. ఎక్స్ షోరూంలో ఈ కారు ధర రూ.41.1 లక్షల నుంచి రూ.48.4 లక్షల మధ్య ఉంది. సెకండ్ హ్యాండ్లో ఈ కారు ఖరీదు రూ.4.9 లక్షల నుండి 19.99 లక్షల మధ్య ఉండనుంది.
బీఎండబ్ల్యూ 5-సిరీస్..
బీఎండబ్ల్యూ 5-సిరీస్ వాహనం సరికొత్త అప్డేట్లతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ 5-సిరీస్ మోడల్లో షో రూమ్ లో ధర వచ్చేసి రూ.55.4 లక్షల నుండి రూ.66.8 లక్షల మధ్య నిర్దేశించింది. సెకండ్ హ్యాండ్లో ఈ కారు ఖరీదు రూ.5.25 లక్షల నుండి 20 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.