BS - 6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసి భారత మార్కెట్లో విడుదల చేశాయి దిగజ్జ వాహన సంస్థలు. అయితే వీటిలో చాలా స్కూటర్లు అత్యుత్తమ విక్రయాలను అందుకున్నాయి. అయితే ప్రస్తుతం మార్కెట్ లో 125 cc స్కూటర్లకు మంచి క్రేజ్ ఉంది. దీనితో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వాహన సంస్థలు కూడా వీటి ఉత్పత్తికే ఎక్కువ దృష్టి చూపిస్తున్నాయి. ఇకపోతే, గత రెండు సంవత్సరాలలో 110 cc మోటార్ సైకిళ్లనూ వాడే వాళ్లు లేకపోలేదు. అయితే ఇప్పటికే యమహా, సుజుకీ లాంటి కంపెనీలు తమ 110 cc స్కూటర్లను నిలిపివేశాయి. ఇందులో హోండా, టీవీఎస్ కంపెనీలు 110 cc స్కూటర్లు ఉన్నాయి. మరి వీటిలో BS - 6 110 cc స్కూటర్లు ఇప్పుడు ఒకసారి చూద్దాం.

 


ఇందులో ఏవి ఉన్నాయో ఒకసారి చూద్దామా మరి ... ​హీరో ప్లెజర్ ప్లస్, టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్, ​బీఎస్6 టీవీఎస్ జూపిటర్, ​బీఎస్6 హోండా డియో, ​హోండా యాక్టివా 6జీ ప్రస్తుతం ఇవి మార్కెట్ లో బాగా అమ్ముడ బోతున్నాయి. ఇక ఆరో తరం స్కూటర్ గా BS - 6 హోండా యాక్టివా భారత మార్కెట్లో లాంచ్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం ఎక్స్ షోరూంలో ఈ వాహనం ధర రూ.64,464 గా కంపెనీ నిర్దేశించింది. ఇక ఈ బైక్ BS - 6 110 cc ఇంజిన్ ను కలిగి ఉండి 7.68 BHP బ్రేక్ హార్స్ పవర్, 8.79 nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 

 


హోండా డియో ఎక్స్ షోరూంలో స్టాండర్డ్ వేరియంట్ ప్రారంభం ధర రూ.59,990 లుగా, డీలక్స్ వేరియంట్ ధర రూ.63,340 గా కంపెనీ నిర్ణయం చేసింది. అలాగే ఇంకా TVS జూపిటర్ స్కూటర్ ఎక్స్ షోరూంలో ధర రూ.61,449 ఉండగా, అదే టాప్ వేరియంటైతే రూ.67,911 గా కంపెనీ నిర్ణయించింది. ఇక TVS స్కూటీ పెప్ ప్లస్ విషయానికి వస్తే రెండు వేరియంట్ల ధర రూ.51,574, రూ.52,954లుగా సంస్థ నిర్దేశించింది కంపెనీ. ఇక చివరగా హీరో ప్లెజర్ ప్లస్ విషయానికి వస్తే స్టీల్ వీల్ కాకుండా అల్లాయ్ వీల్ కలిగిన ఈ స్కూటర్ అయితే రూ.56,800 లుగా కంపెనీ నిర్దేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: