ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి కారణంగా ఆటోమొబైల్ రంగం పూర్తిగా కుదేలైంది అని చెప్పవచ్చు. లాక్ డౌన్ కారణంతో వాహన రంగానికి రూ. 1. 25 లక్షల కోట్ల వరకు ఆదాయం నష్టం వచ్చిందని అంచనా వేస్తున్నారు నిపుణులు. మామూలుగా ఒక్కరోజు ఆటో పరిశ్రమ స్తంభించింది అంటే రూ. 2000 కోట్ల పైనే నష్టం వాటిల్లుతుందని భారత వాహన తయారీ దారుల సంఘం ఇదివరకే తెలిపింది.
అయితే లాక్ డౌన్ వల్ల ఆటోమొబైల్ రంగానికి నష్టం వాటిల్లడం ఒక ఎత్తు అయితే దీనితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆదాయాన్ని వారు కోల్పోవాల్సి వచ్చింది. అది ఎలా అంటే ఎవరైనా కొత్త వాహనాలు కొనుగోలు పై కేంద్రం విధించే జిఎస్టి, రిజిస్ట్రేషన్ ట్యాక్స్, మోటార్ బీమా పై జిఎస్టి, ఇంకా పెట్రోల్, డీజిల్ వాడుకతో వచ్చే ఎక్సైజ్ సుంకం ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం కోల్పోయిందని చెప్పవచ్చు.
అయితే ఈ వాహన తయారీ దారలు వాటిపై ఆధారపడి పనిచేసే విడిభాగాల కంపెనీలు కూడా చాలా వరకు మూతపడ్డాయి. దీనివల్ల కేంద్రానికి దగ్గర దగ్గరగా 40 కోట్ల వరకు గండి పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వమే కాకుండా రాష్ట్రానికి వచ్చే కూడా ఆదాయాన్ని కోల్పోతుందని వారు తెలుపుతున్నారు. ఇకపోతే కొన్ని ప్రాంతాల్లో వాహన ప్లాంట్స్ కు ఉత్పత్తికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కాకపోతే కంపెనీలు మాత్రం వారి కార్యకలాపాలను ప్రారంభించడానికి కాస్త వెనకడుగు ఉన్నాయి. దీనికి కారణం వారికి కావలసిన విడిభాగాల కొరత అంతే కాకుండా బయట షోరూములు తెరుచుకోకపోవడం వంటి కారణాలు ఎన్నో అని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఆటోమొబైల్ రంగం తిరిగి తన స్థానానికి చేరుకోవాలంటే ఈ కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గిన తర్వాతనే వీటి యధా స్థానానికి చేరుకోగలవు.