ప్రపంచం మొత్తం ప్రస్తుతం కరోనా నేపథ్యంలో విలవిల లాడుతున్న సంగతి తెలిసినదే. దీనితో ప్రపంచం మొత్తం అన్ని రంగాలు దెబ్బతిన్నాయని చెప్పవచ్చు. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ రంగ సంస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఒకవైపు ఉత్పత్తి కర్మాగారాలు లాక్ డౌన్ కారణంగా మూసివేయడంతో, మరోవైపు షోరూమ్స్ పూర్తిగా మూసివేయడంతో ఈ రంగం చాలా దెబ్బతింది.  అయితే ఇక అసలు విషయంలోకి వెళితే...

IHG

హుండాయ్ సంస్థ తన కొత్త i 30 ఉత్పత్తిని యూరప్ లో తన ప్లాంట్ లో మే 25 నుంచి ప్రారంభిస్తామని ప్రకటించింది. ఈ ప్రసిద్ధ మోడల్ చెక్ రిపబ్లిక్ ఉత్పత్తి కర్మాగారంలో తయారు చేయబడుతుంది. మొదటగా హుండాయ్ i 30 ఐరోపాలో 2007 సంవత్సరంలో మార్కెట్లోకి విడుదలైంది. యూరోపియన్ మార్కెట్లలో అత్యధికంగా అమ్ముడుపోయిన కారులో ఇది కూడా ఒకటి. 2018 సంవత్సరంలో వీటి యొక్క అమ్మకాలు భారీగా పెరగడంతో చెక్ రిపబ్లిక్ తయారీ సంస్థలు కూడా ఈ కార్యక్ర ఉత్పత్తిని భారీగా పెంచారు. ఇక వీటితో పాటు హుండాయ్ ఒక మిలియన్ టక్సన్ SUV లను ఉత్పత్తి చేసి రికార్డును నెలకొల్పింది.

IHG


ఇకపోతే i 30 ప్రీమియం కారును భారత మార్కెట్లో లాంచ్ చేసిన తర్వాత ఎక్స్ షోరూమ్ ధర 10 నుంచి 12 లక్షల మధ్య ఉండబోతుందని అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇకపోతే ఈ కొత్త i30 ప్రీమియం కారు చాలా చూడటానికి ఆకర్షణీయంగా  రూపొందించారు. హ్యుందాయ్ i 30 కారులో స్పాట్ టెస్ట్ ‌లో కనిపించే మాదిరిగానే 1.6 D బ్యాడ్జ్ ఉంది. ఇక దీని ప్రకారం ఈ i 30 కారులో 1.6 సిలిండర్ టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజన్ ఇది కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 115 BHP శక్తి, 136 nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6 - స్పీడ్ మాన్యువల్ యూనిట్ లేదా 7 - స్పీడ్ డ్యూయల్ క్లచ్ యూనిట్ కలిగి ఉండవచ్చు అని తెలుస్తోంది. ఇక యూరూప్ ‌లోని i 30 కారులో 1.0 lr. టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఇది కలిగి ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: