జపాన్ దేశ కార్ల తయారీ సంస్థ అయిన నిస్సాన్ ప్రస్తుతం భారత దేశంలో పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. ఈ కార్ల విక్రయాలు మిగతా కంపెనీలతో పోలిస్తే వెనుకంజలో ఉన్నాయి. అయితే తాజాగా ఈ కంపెనీ భారత్లో BS 6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా మొదటి కాంపాక్ట్ SUV విడుదల చేయబోతోంది. ఇకపోతే ఈ కారు ప్రారంభ ధర రూ. 949000. అయితే ఈ కారు మొత్తం ఏడు వేరియంట్స్ లో మనకు లభిస్తుంది. ఒక్కొక్క వేరియంట్ కు ఒక్కో కారు ధరగా అ కంపెనీ నిర్ణయించింది. ఇందులో హై ఎండ్ మోడల్ ధర 14.15 లక్షలు. ఇకపోతే ఈ కార్ వివిధ వేరియంట్స్ యొక్క వివిధ ధరలు ఇలా ఉన్నాయి. 

 

1.5 ఎక్స్ఎల్ రూ. 9,49,990, 1.5 ఎక్స్ వీ రూ . 9,99,990, 1.3 టర్బో ఎక్స్ వీ. రూ. 11,84,990 , 1.3 టర్బో ఎక్స్ వీ ప్రీమియం రూ.12,64,990 , 1.3 టర్బో ఎక్స్ వీ  ప్రీమియం(ఓ) రూ. 13,69,990, 1.3 టర్బో ఎక్స్ వీ ప్రీమియం(ఓ) డ్యూయల్ టోన్ రూ. 13,89,990, 1.3 టర్బో ఎక్స్ వీ సీవీటీ రూ. 13,44,990, 1.3 టర్బో ఎక్స్ వీ ప్రీమియం సీవీటీ రూ. 14,14,990 గా కంపెనీ నిర్ణయించింది.

 

ఇక ఈ కారులోని ఇంజన్ విషయానికి వస్తే నిస్సాన్  కిక్స్ SUV 1.5 lr. ఎస్పి రేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఇది కలిగి ఉంది. అంతేకాకుండా 105 BHP బ్రేక్ హార్స్ పవర్, 142 nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 5  - స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థతో ఈ కార్ పనిచేస్తుంది. అదే 1.3 lr. టర్బో పెట్రోల్ ఛార్జెడ్ ఇంజిన్ అయితే 156 BHP బ్రేక్ హార్స్ పవర్, 254 nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇక ఈ కార్ ప్రత్యేకతలు చూస్తే ..ఈ సరికొత్త SUV ఇంజిన్ సిలీండర్ ఫ్లోటింగ్ టెక్నాలజీని కలిగి ఉంది. ఈ సాంకేతికతను నిసాన్ జీటీ - R మోడల్ నుంచి ఆదర్శంగా తీసుకున్నారు. ఇక దీని ద్వారా మైలేజి కూడా చాలా బాగా పెరగనుంది. అంతే కాకుండా హెడ్ లైట్లు, సరికొత్త గ్రిల్, వెనక వైపు బంపర్లు లాంటి కొన్ని అప్డేట్లతో అందుబాటులోకి ఈ కార్ వచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: