ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలను ఎంత ఇబ్బంది పెడుతున్న ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనితో అనేక దేశాలలో లాక్ డౌన్ వ్యవస్థ కొనసాగుతోంది. అలాగే మన దేశంలో కూడా ఐదవసారి లాక్ డౌన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఈ దెబ్బతో దేశంలో అనేక రంగాలకు పురోగతి మందగించింది. అందులోనూ ఆటోమొబైల్ రంగ సంస్థ పూర్తిగా దెబ్బతింది. అటు తయారీ పరిశ్రమలు కార్మికులు లేక మూసి వేయగా, మరోవైపు లాక్ డౌన్ కారణంగా కార్ల షోరూమ్స్ తెరుచుకోకపోవడంతో క్రయవిక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. అంతేకాకుండా అనేక వాహన సంస్థలు కూడా కొత్త కార్ల విడుదలను కూడా ఆపేశారు. ఇది ఒక సైడ్ మాత్రమే, మరో పక్క ఉన్న స్టాక్ ను విక్రయించడం మరో ఎత్తుగా అవుతోంది. ఇక ఈ నేపథ్యంలో ప్రముఖ వాహనం సంస్థ హోండా తన అమేజ్ మోడల్ కారుకు భారీ రాయితీలు ప్రకటించింది. దాదాపు ఆ కారు మీద 32 వేల రూపాయల వరకు క్యాష్ డిస్కౌంట్ ను అందించనుంది. ఇది ఒక్కటే కాకుండా అదనపు రాయితీలను కూడా ఇవ్వబోతోంది.
ఇక ఆ విశేషాల్లోకి వస్తే హోండా సిటీ మోడల్పై ఏకంగా లక్ష రూపాయల వరకు ఇచ్చిన సంస్థ తాజాగా హోండా అమేజ్ పై కూడా ఇలాంటి రాయితీని ఇచ్చింది. ఈ ఆఫర్ లో కేవలం 32 వేల రూపాయల క్యాష్ డిస్కౌంట్ ఒక్కటే కాకుండా... 20 వేల రూపాయల ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఈ కారు పై సంస్థ ప్రకటించింది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఐదు సంవత్సరాల వరకు అన్ లిమిటెడ్ కిలోమీటర్ల వరకు ఈ కారు పై వారెంటీని పొడిగించింది. మామూలుగా ఇది కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. తాజాగా దీనిని ఐదు సంవత్సరాల వరకు పొడిగించింది. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక పెట్టింది కంపెనీ. ఒకవేళ మీరు వారింటి కావాలనుకునేవారు... ఎక్స్చేంజి బోనస్ మాత్రం పొందలేరు. వారు మళ్లీ దానిని సపరేట్ గా కొనుక్కోవాల్సి ఉంటుంది.