లాక్ డౌన్ నేపద్యంలో మిగిలిపోయిన స్టాకును అమ్ముకోడానికి ఆటోమొబైల్ రంగ సంస్థలు తెగ ప్రయాస పడిపోతున్నాయి. ఇందుకుగాను ఆటోమొబైల్ రంగ సంస్థలు తమ కార్లను అమ్ముకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆయా సంస్థలు వారి కార్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి. ఇక తాజాగా ఈ వరుసలోకి ప్రముఖ ఆటో సంస్థ రెనాల్ట్ కూడా చేరింది. రెనాల్ట్ కంపెనీ లోని వాహనాలైన రెనాల్ట్ డస్టర్, క్విడ్ వంటి వాహనాలపై ఆఫర్స్ ను ప్రకటించింది.
తాజాగా రెనాల్ట్ కంపెనీ తన కొత్త మోడల్ డస్టర్ ను పెట్రోల్ మోడల్ గా నిస్సాన్ కిక్స్ ద్వారా మార్కెట్లోకి విడుదల చేసింది. అంతేకాదు ప్రస్తుతం ఆ మోడల్ కార్ పై గరిష్ట రాయితీని ప్రకటించింది రెనాల్ట్. ఈ కారుపై ఎకంగా 25 వేల రూపాయల క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ ప్రకటించింది. అయితే ఇది మాత్రం కేవలం Rxs వేరియంట్ పై మాత్రమే రాయితీని ప్రకటించింది. దీనితోపాటు ఏదైనా కార్ ఎక్స్చేంజ్ ఆఫర్ లో మరో అదనంగా 20 వేల రూపాయలు కూడా లాయల్టీ బోనస్ ప్రకటించింది. ఇకపోతే ప్రస్తుతం షోరూంలో రెనాల్ట్ డస్టర్ ధర రూ 8.49 లక్షల గా ఉంది.
ఇక అలాగే మరో రెనాల్ట్ ట్రైబర్ కార్ పై కూడా ఏకంగా 20 వేల ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ ను తీసుకు వచ్చింది. అయితే ఈ కార్ కు ఎలాంటి క్యాష్ డిస్కౌంట్ మాత్రం లేదు. అయితే పది వేల రూపాయల లాయల్టీ డిస్కౌంట్ ను అందించింది. ఇక మరో కారు రెనాల్ట్ క్విడ్ కు రూ. 15000 డిస్కౌంట్ ఇవ్వగా మరోవైపు లాయల్టీ లో పది వేల రూపాయల వరకు అందజేస్తోంది. అయితే ఈ ఆఫర్ మాత్రం సెలెక్ట్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది. వీటితో పాటు అతి తక్కువ వడ్డీ రేటుకు EMI లని కూడా అందుబాటులోకి తెచ్చాయి.