కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం ఎంత ఇబ్బంది పడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో అనేక రంగాల పురోగతి తగ్గిపోయింది. ఇందులో ఆటోమొబైల్ రంగం పూర్తిగా ప్రభావితం చూపింది. ఈ నేపథ్యంలో కార్ల అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయి. లాక్ డౌన్ కంటే ముందుగా కార్ల పరిశ్రమ ఒత్తిడిలో ఉండగా అది కాస్తా కరోనా దెబ్బతో పూర్తిగా దెబ్బతింది. 

 

IHG

 

దీంతో ఆటోమొబైల్ రంగంలో పూర్తిగా క్రయ విక్రయాలు తగ్గిపోవడంతో, ఆటో మొబైల్ రంగ సంస్థలు వారి సేల్స్ పెంచుకోవడానికి భారీ డిస్కౌంట్ లో ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇందుకు సంబంధించి తాజాగా మహీంద్రా అండ్ మహీంద్రా జూలై ఆఫర్ ను విడుదల చేసింది.

IHG

 

ఈ ఆఫర్లో ఏకంగా మహీంద్రా కు సంబంధించిన కారును కొనుగోలు చేయడం ద్వారా మూడు లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం కంపెనీ ఇచ్చింది. 

IHG

 

ఇక ఇందులోని ఆఫర్ల విషయానికి వస్తే మహీంద్రా KUV 100 NXT లపై రూ. 62,055, మహీంద్రా బొలెరో లపై రూ.13,500, మహీంద్రా XUV 300 లపై రూ. 64,500, మహీంద్రా స్కార్పియో లపై రూ .25 వేలు, మహీంద్రా XUV 500 లపై రూ .39,000, మహీంద్రా ఆల్తూరస్ G4 లపై ఏకంగా రూ. 3.05 లక్షలు ఈ విధంగా భారీ ఆఫర్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా కారు కొనాలనుకునేవారు మహీంద్రా కంపెనీ నుండి భారీ స్థాయిలో రాయితీలను పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: