
స్మార్ట్ ఫోన్ రంగంలో షియోమి కంపెనీ సృష్టించిన సునామి అంతా ఇంతా కాదు. ఈ కంపెనీ దెబ్బకు భారతదేశంలో నోకియా, సాంసంగ్ కంపెనీ ల స్మార్ట్ ఫోన్ అమ్మ కాలు దారుణంగా పడిపోయాయి. దీంతో కేవలం భారతదేశంలోనే కాకుండా స్మార్ట్ ఫోన్ రంగంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థాయికి ఎదిగింది షియోమి. అయితే ఈ సంస్థ తన కొత్త ఎలక్ట్రికల్ స్కూటర్ ని మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే దీనిని మొదటగా చైనా దేశంలోని మొదలు పెట్టింది. అయితే ఇందుకు సంబంధించిన ధర 3599 యువాన్లు అనగా, మన దేశంలో సుమారుగా 38 వేల రూపాయలు అన్నమాట.
ఇందుకు సంబంధించి పూర్తిగా షియోమీ సంస్థ కేవలం యువతను దృష్టిలో పెట్టుకుని ఈ వాహనాలను విడుదల చేసినట్టుగా ఉంది. ఇతర వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రికల్ వెహికల్ ఈ విభాగంలో ఈ స్కూటర్ లు మంచి పోటీ ఇవ్వనున్నాయి. ఈ స్కూటర్ లో 400 w మోటర్ కలిగి ఉంది. ఇది 40 nm టార్క్ ను విడుదల చేస్తోంది. అయితే ఈ స్కూటర్ అత్యధికంగా 25 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించగలదు. అయితే ఒకసారి బ్యాటరీ ఫుల్లుగా ఛార్జింగ్ పెడితే ఈ వాహనంపై 35 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు.
ఇక ఇందులో షియోమీ సంస్థ సి 40, సి 60 , సి 80 లను కూడా అందుబాటులోకి తీసుక రాబోతుంది. అయితే ఇవి కాస్త ఎక్కువ ధర ఉండవచ్చు. ఇకపోతే ప్రస్తుత భారతదేశ- చైనా దేశాల మధ్య నడుస్తున్న యుద్ధవాతావరణం నేపథ్యంలో భారత దేశంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎప్పుడు విడుదల చేస్తుంది ఎలాంటి సమాచారం లేదు. అయితే భారత్ లో పెద్ద ఎత్తున్న తన ఉత్పాదలను అమ్మకం చేస్తున్నాయి. ఇక ల్యాప్ టాప్‌లు, ఇయర్ ఫోన్లు, ఫిట్‌నెస్ బ్యాండ్లు, ఎయిర్ ప్యూరిఫైయర్లు లాంటి అనేక ఉత్పత్తులను భారత్ లో అందిస్తోంది.